ఆంధ్ర ప్రదేశ్
ఓయి-లింగారెడ్డి గజ్జల
అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లు, చిరు ఉద్యోగుల సంక్షేమంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని రాష్ట్ర హోంమంత్రి అనిత తెలిపారు. ఉద్యోగుల హామీల అమలులో ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆమె చెప్పారు. గతంలో ఎన్నడూ లేని విధంగా అంగన్వాడీ వేతనాలను చరిత్రలోనే తొలిసారిగా రెండు సార్లు పెంచిన ఘనత తమ ప్రభుత్వానిదేనని ఆమె పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేయడంలో ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందన్నారు.
అధికారంలోకి వచ్చిన వెంటనే అంగన్వాడీ కేంద్రాల మౌలిక వసతుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు ఉంది. రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాల్లో సౌకర్యాలు, మరుగుదొడ్ల నిర్మాణానికి రూ.868 లక్షలు విడుదల చేసి, ఒక్కో కేంద్రానికి ప్రత్యేకంగా నిధులు కేటాయించినట్లు వివరించారు.

అంగన్వాడీ జీతాల ఆలస్యానికి పూర్తిగా చెక్ ..
అంగన్వాడీ సిబ్బందికి ప్రతి నెలా ఒక్కరోజే వేతనాలు చెల్లించే విధానాన్ని అమలు చేసి, జీతాల ఆలస్యానికి పూర్తిగా చెక్ పెట్టాం. సుమారు 58,204 మంది అంగన్వాడీ వర్కర్లు, సూపర్వైజర్లు, బ్లాక్ కోఆర్డినేటర్లకు రూ.75 కోట్లతో 5G స్మార్ట్ఫోన్లు అందించినట్లు చెప్పారు. ఈ స్మార్ట్ఫోన్ల ద్వారా గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు సేవలు మరింత వేగంగా, అందుతున్నాయని.
అంగన్వాడీలకు గ్రాట్యుటీ..
ప్రభుత్వ చర్యల ఫలితంగా అంగన్వాడీ కేంద్రాల హాజరు శాతం 70 నుంచి 96కు పెరిగిందని ఆమె పేర్కొన్నారు. ఏళ్లుగా గ్రాట్యుటీ సమస్యకు పరిష్కారం చూపిన ప్రభుత్వం ఇదేనని అన్నారు. 2025 ఆంధ్రప్రదేశ్ బడ్జెట్లో గ్రాట్యుటీ చెల్లింపుల కోసం రూ.20 కోట్లు కేటాయించారు, అధికారంలోకి వచ్చిన తొమ్మిది నెలల్లోనే అంగన్వాడీలకు అండగా నిలిచిపోయింది.
అంగన్వాడీ కేంద్రాల అప్..
రాష్ట్రవ్యాప్తంగా 5,000 మినీ అంగన్వాడీ కేంద్రాలను పూర్తి స్థాయి కేంద్రాలుగా అప్డేట్ చేసే ప్రక్రియ కొనసాగుతోందని చెప్పారు. మినీ అంగన్వాడీ కార్యకర్తలకు టీచర్‌గా పదోన్నతి ఇచ్చి, పూర్తి స్థాయి వేతనాలు అందించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అదేవిధంగా కొత్తగా 5,000 మంది అంగన్వాడీ సహాయకులను నియమించారు.
వేతనాల పెంపు ?
అంగన్వాడీలు ప్రతిపాదించిన 9 డిమాండ్లను ఇప్పటికే పరిష్కరించామని, వేతనాల పెంపుదలను కూడా త్వరగా అమలు చేసే దిశగా చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి స్పష్టంగా, ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం ఎప్పటికీ ప్రాధాన్యత ఇస్తోంది.
గత ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీసి వెళ్లిందని, వారు చేసిన అప్పుల కారణంగా ప్రస్తుత ఆదాయంతో పాటు అప్పులు తీసుకుని వడ్డీలు చెల్లించాల్సిన పరిస్థితి ఉందని హోంమంత్రి అనిత తెలిపారు. అయినప్పటికీ ఉద్యోగుల సంక్షేమంలో ఎలాంటి రాజీ ఉండదని ఆమె స్పష్టం చేశారు.

